TDP: టీడీపీ ఓటు బ్యాంకుపై కేటిఆర్ ఫోకస్…?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ(TDP) ఓటు బ్యాంకుపై… భారత రాష్ట్ర సమితి(BRS) ఫోకస్ పెట్టిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తెలంగాణలో ఇబ్బంది పడుతున్న గులాబీ పార్టీ.. ఇప్పుడు ఎలాగైనా సరే తిరిగి అధికారంలోకి రావాలని నానా కష్టాలు పడుతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే విషయంలో ఆ పార్టీ నేతలు ఇబ్బందులు పడుతున్నారు. రేవంత్ రెడ్డి విమర్శలకు.. ఆయన చేసే వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేక గులాబీ పార్టీ సమస్యలు ఎదుర్కొంటుంది.
ఇక గులాబీ పార్టీలో నాయకత్వం లోపం కూడా ఉందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ బయటకు రాకపోవడం, కేటీఆర్ విమర్శలకు పెద్దగా మీడియా ప్రాధాన్యత ఇవ్వకపోవడం.. హరీష్ రావు కూడా కాస్త సైలెంట్ గా ఉండటం, ఈ మధ్యకాలంలో సంచలనం అవుతుంది. దీనితో ఆ పార్టీని ఎలాగైనా సరే గాడిలో పెట్టాలని కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
తాజాగా సూర్యాపేటలో నిర్వహించిన ఒక సభలో కేటీఆర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు వారికి గౌరవం దక్కేలా చేసింది.. మదరాసిలు అనే గుర్తింపు పోగొట్టింది కేవలం ఎన్టీఆర్ అని… ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆయన తెలుగువారి కోసం నిలబడ్డారు అంటూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను టిడిపి సోషల్ మీడియా వైరల్ చేస్తుంది. తెలంగాణలో టిడిపికి బలమైన ఓటు బ్యాంకు ఉంది. 2023 ఎన్నికల్లో ఆ ఓటు బ్యాంకు మొత్తం రేవంత్ రెడ్డి వైపు తిరిగింది.
ఇప్పుడు ఓటు బ్యాంకు ను తమ వైపుకు తిప్పుకోవాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. టిడిపి కచ్చితంగా తెలంగాణలో బిజెపితో కలిసి వెళితే… ఎక్కువగా నష్టపోయేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. దీనితో టిడిపి ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకోవడానికి కేటీఆర్ ఇప్పటినుంచే జాగ్రత్తలు పడుతున్నారు. మరి భవిష్యత్తులో ఆయన ఇంకెన్ని వ్యాఖ్యలు చేస్తారో చూడాలి.