మహిళలను గౌరవించాలని విచారణకు వచ్చా

తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే విచారం వ్యక్తం చేశానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు కమిషన్ కార్యాలయం వద్దకు వచ్చి రాజకీయం చేశారన్నారు. బీఆర్‌ఎస్ మహిళా నేతలపై దాడి చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలను గౌరవించాలని విచారణకు వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలోని సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, వసతి గృహాల్లో పిల్లల సమస్యలపై ప్రస్తావించినట్లు తెలిపారు. అంతకుముందు విచారణ సందర్భంగా కేటీఆర్‌కు మహిళా కమిషన్ సభ్యులు రాఖీలు కట్టారు.