KCR: జగన్ వస్తున్నారు.. మరి కేసీఆర్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్(YS Jagan) అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఇప్పుడు మరో చర్చ మొదలైంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్(KCR) అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటై.. ఏడాదైనా సరే ఇప్పటివరకు కేసిఆర్ మాత్రం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపించలేదు. పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్న సరే కేసీఆర్ మాత్రం సైలెంట్ గానే ఉండిపోతున్నారు.
ఈమధ్య కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. అటు గులాబీ పార్టీ నుంచి ఇప్పటివరకు స్పష్టత లేదు. బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు సభకు హాజరైతేనే ప్రాధాన్యత ఉంటుంది. కానీ కేసీఆర్ మాత్రం హాజరవుతారా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రావటం లేదు. త్వరలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటే కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉంటుంది. పలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి నిధులను కేటాయించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకడు వేస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి కెసిఆర్ కు మంచి అవకాశం దొరుకుతుంది.
అటు గులాబీ పార్టీ సోషల్ మీడియా కూడా కెసిఆర్ సమావేశాలకు రావాలని రిక్వెస్ట్ చేస్తుంది. మరి కేసిఆర్ దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారనేది క్లారిటీ రావటం లేదు. ఇప్పటివరకు సమావేశాల్లో హరీష్ రావు, కేటీఆర్ లేదంటే పాడి కౌశిక్ రెడ్డి వంటి వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. కేసీఆర్ మాట్లాడితే ఆ లెవల్ వేరే ఉంటుంది. అందుకే గులాబీ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ సమావేశాలకు రావాలని విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఏపీలో జగన్ కూడా సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఆసక్తిని రేపుతోంది.