Kaleshwaram Project : కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే.. కాళేశ్వరం నుంచి : హరీశ్‌రావు

కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే కాళేశ్వరం నుంచి నీళ్లు ఆపుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. సిద్దిపేటలో 167 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు (CMRF checks) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కాళేశ్వరం కూలిపోయిందని ఊరికే బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాలకు గోదావరిలో 8 లక్షల క్యూసెక్యూలు వృథాగా పోతున్నాయి. మోటార్లు ఆన్ చేయకుండా రాజకీయాలు చేస్తున్నారు. మోటార్లు ఆన్ చేస్తే వారం రోజుల్లో రంగనాయకసాగర్ (Ranganayaka Sagar) నిండిపోతుంది. మేడిగడ్డ కూలితే మోటార్లు, లారీలు ఎలా నడుస్తున్నాయి? రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌లు కాళేశ్వరంలో భాగం కావా? ఇవేమీ చూడకుండా కాళేశ్వరం కూలిపోయిందని అసత్య ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ (Assembly)లో చర్చపెడితే మీరేం చేశారో మేమేం చేశామో మాట్లాడుకుందాం. రెండు పిల్లర్లకు మరమ్మతులు చేస్తే ఆరు నెలల్లో నీళ్లు ఇవ్వొచ్చు. మేం ప్రశ్నించడంతోనే కల్వకుర్తి మోటార్లు ఆన్ చేశారు. నాట్లకు నాటకు మధ్య కేసీఆర్ రైతుబంధు ఇచ్చారు. ఓట్లకు ఓట్లకు మధ్య మీరు రైతు భరోసా ఇస్తున్నారు. రైతుభరోసాను ఎలా కోత పెడదామనే చూస్తున్నారు అని ఆరోపించారు.