వాస్తు పిచ్చితో సీఎం రేవంత్‌రెడ్డి మార్పులు : హరీశ్‌రావు

సచివాలయంలో మార్పులపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రీన్ టెక్నాలజీ, ఫైర్ సేఫ్టీ నార్మ్స్‌తో దీన్ని నిర్మించినట్లు తెలిపారు. వాస్తు పిచ్చితో సీఎం రేవంత్ రెడ్డి మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. సచివాలయానికి పూటకో మార్పు చేస్తున్నారని తెలిపారు. వాస్తు దోషం ఉందని ఒక్క గేట్ మార్పు కోసం రూ.4 కోట్లు ఖర్చు పెడుతున్నారని పేర్కొన్నారు.