Sridhar Babu: తెలంగాణలో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ విద్య: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా బలోపేతం చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు (Sridhar Babu) పునరుద్ఘాటించారు. ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మంచిర్యాల జిల్లాలో ఆయన పర్యటించారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేస్తామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుందని ఆయన (Sridhar Babu) పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో గత ప్రభుత్వం కంటే తాము ఎంతో ముందున్నామని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామని, మంచిర్యాల నియోజకవర్గానికి ఇటీవల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేశామని ఆయన (Sridhar Babu) గుర్తుచేశారు.