అమెరికా నుంచి తెలంగాణ రాజకీయాల్లోకి… ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ విజయ ప్రస్థానం

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన మదన్ మోహన్ నేడు రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలకపాత్రను పోషిస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తూ, తన ఐటీ అనుభవాన్ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీకి అవసరమైన డిజిటల్ సేవలను ఆయన అందిస్తున్నారు. పిసిసి ఐటీ సెల్ ఇన్‌ఛార్జీగానూ, ఇతర సేవలను అందిస్తూ రాహుల్ గాంధీ అభిమానాన్ని చూరగొన్నారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. ఓవైపు కాంగ్రెస్‌లో కీలకపాత్ర పోషిస్తూనే, మరోవైపు నియోజకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ సేవలను అందిస్తున్నారు. మదన్‌మోహన్ ట్రస్ట్ ద్వారా కూడా పేదలను ఆదుకుంటున్నారు.
సాధారణ కుటుంబంలో జన్మించిన మదన్మోహన రావు ఉన్నత చదువులు చదివి, అమెరికా లో వాషింగ్టన్ డిసి లో ఎంట్రప్రెన్యూరర్‌గా మారి విజయవంతంగా తన కెరీర్ ని తీర్చిదిద్దుకొన్నారు. అయినా మాతృ దేశం మీద మమకారంతో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించి సత్తాను చాటుకుంటూ వస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయాన్ని సాధించారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండడం, కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎప్పటికప్పుడు అసెంబ్లీలో ఎల్లారెడ్డి నియోజకవర్గం సమస్యలపై గొంతు విప్పడం, పరిష్కారించుకోవడంతో పాటు, ఎల్లారెడ్డి సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళడంలో మదన్ మోహన్ రావు సఫలం అయ్యారు.
వెనుకబడిన ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వాల్సిందిగా ఆయన ముఖ్యమంత్రిని ఆర్థికమంత్రిని స్వయంగా కలిసి కోరారు. అలాగే నియోజకవర్గంలో ఆటగాళ్ళను కూడా ఆయన ప్రోత్సహిస్తున్నారు. ఇబ్బందుల్లో యువ క్రీడాకారుడికి ఆర్ధిక సహాయం కూడా అందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఒక రూపాయి జీతం తీసుకుంటూ, మిగిలిన జీతాన్ని ఆయన కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు ఇస్తూ అందరి ప్రశంసలను అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీకి తన సేవలను అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహకారాన్ని అందిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఎఐ గ్లోబల్ సమ్మిట్ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మదన్ మోహన్ కూడా పాల్గొన్నారు.
సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో ఈ గ్లోబల్ ఎఐ సమ్మిట్ జరగనున్నది. గత జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు లండన్‌లో కూడా మదన్ మోహన్ పర్యటించి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను, పథకాలను ఎన్నారైలకు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికోసం కట్టుబడి ఉందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఇలా ఎన్నో సేవలతో, కార్యక్రమాలతో మదన్ మోహన్ తెలంగాణ ప్రజలకు సేవలందిస్తున్నారు.