ఫెడెక్స్ ఏసీసీ సెంటర్ ఇక్కడే!
అమెరికాకు చెందిన సరుకు రవాణా సేవల సంస్థ ఫెడెక్స్ దేశంలో తన తొలి అడ్వాన్స్ కెపాబిలిటీ కమ్యూనిటీ (ఏసీసీ) సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పబోతున్నది. ఈ ఏడాది రెండో అర్థభాగంలో అందుబాటులోకి రానున్న ఈ సెంటర్‌తో భాతర్‌లో తన విస్తరణ కార్యకలాపాలను మరింత వేగవంతం విస్తరించడానికి దోహదం చేయనున్నదని పేర్కొంది. ముఖ్యంగా వ్యాపార వర్గాలకు మరింంత వేగవంతంగా సరుకు రవాణా చేయడానికి అవసరమైన టెక్నాలజీ, ఇన్నోవేషనపరంగా చర్యలకు ఈ సెంటర్ కీలకం కానున్నదని కంపెనీ వర్గాలు వెల్లడిరచాయి. వ్యాపార అవసరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ ఏసీసీ సెంటర్లను నెలకొల్పాలని కంపెనీ నిర్ణయించింది.






