Revanth Reddy:నల్గొండ చరిత్రే.. తెలంగాణ చరిత్ర : సీఎం రేవంత్ రెడ్డి

రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం, గుర్తింపు ఆకలి తీర్చే ఆయుధమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరిలో నిర్వహించిన నూతన రేషన్ కార్డు (Ration cards ) ల పంపిణీ కార్యాక్రమంలో రేవంత్ మాట్లాడారు. నల్గొండ చరిత్రే (Nalgonda history) , తెలంగాణ చరిత్ర అంటే అతిశయోక్తి కాదన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలపై సీఎం విమర్శలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నా పేదలకు రేషన్ కార్డు, సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన బీఆర్‌ఎస్ నేతల (BRS leaders) కు రాలేదు. మా ప్రభుత్వం 3.10 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తే రేషన్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. వ్యవసాయం దండగ కాదు, పండగ అని గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చాం. దేశం తలెత్తుకునేలా వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్నాం. ప్రతిపక్ష పార్టీ నేతలు అధికారంలోకి ఉన్నప్పుడు గోదావరి (Godavari) నీళ్లు ఇవ్వలేదు. ఇప్పుడు సీఎం వస్తే అడ్డుకుంటామంటున్నారు. గతంలో 3 రోజులు అవకాశమిస్తే తుంగతుర్తికి జలాలు తెస్తామన్నారు. పదేళ్లు అవకాశం ఇచ్చినా దేవాదుల నుంచి నీళ్లు తేలేదు అని విమర్శించారు.