మే 15న ఫాక్స్‌కాన్ కు భూమిపూజ
ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హోన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్‌నకు చెందిన ఫాక్స్‌కాన్ పరిశ్రమ భూమిపూజ వచ్చే నెల 15న రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులకు సూచించారు. ఈ పరిశ్రమ రాకతో రాష్ట్రంలో ప్రత్యక్షంగా 35 వేల మందికి, పరోక్షంగా అంతకు రెట్టింపు మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు పెట్టుబడులను ఆకర్షించడానికి మే రెండో లేదా మూడో వారంలో మంత్రి కేటీఆర్ అమెరికా, యూకేలకు వెళ్లనున్నారు. ఆ పర్యనటలో బహుళసంస్థలు పెట్టుబడులకు ముందుకు రానున్నట్లు తెలుస్తుంది.






