క్యాటర్పిల్లర్ హైదరాబాదులో తన కస్టమర్ల సమావేశములో భారీ హైడ్రాలిక్ ఎక్స్కవేటర్ల అత్యాధునిక శ్రేణిని ప్రదర్శించి చూపింది
ప్రపంచంలో నిర్మాణరంగము మరియు మైనింగ్ యంత్రపరికరాలు, హైవే-బయటి డీజిల్ మరియు సహజ వాయువు ఇంజన్లు, పారిశ్రామిక గ్యాస్ టర్బైన్లు మరియు డీజిల్-ఎలెక్ట్రిక్ లోకోమోటివ్స్ యొక్క అతిపెద్ద తయారీదారు అయిన Caterpillar Inc., మరియు సుదీర్ఘకాలంగా Cat® డీలరుగా ఉన్న Gmmco, తమ తర్వాతి తరం యొక్క క్యాట్ లార్జ్ హైడ్రాలిక్ ఎక్స్కవేటర్ల యొక్క అత్యాధునిక శ్రేణిని ప్రదర్శించి చూపుటకు గాను 2023 మే 8 వ తేదీన హైదరాబాదు లోని జిఎంఆర్ ప్రాంగణములో ఒక-రోజు కార్యశాలను ఏర్పాటు చేశాయి. యంత్రాల యొక్క అత్యాధునిక సాంకేతికతా వినూత్నతలను అర్థం చేసుకోవడంలో ఈ కార్యక్రమం కస్టమర్లకు తోడ్పడింది మరియు తమ సరియైన పనికి గాను సరియైన పరికరాన్ని ఎంచుకోవడానికి వారికి సహాయపడింది
374 మరియు 395 ఎక్స్కవేటర్లతో పాటుగా ఇటీవలనే ప్రారంభించబడిన Cat 350 ఎక్స్కవేటర్ ఈ కార్యక్రమంలో ప్రదర్శించబడ్డాయి. కస్టమర్ల యొక్క బహుళ-విధుల అవసరాలను తీర్చడానికి గాను ఉత్పాదకతను పెంచుటలో, మెరుగైన వ్యయ సమర్థతను అందించి, భద్రతను పెంచి మరియు ఇంతకు మునుపు ఉన్న వాటితో పోలిస్తే మరింత అనుకూలీకృతమైన ఫీచర్లను అందజేయడానికి సహాయపడగలిగిన అత్యుత్తమ శ్రేణి సాంకేతిక పరిజ్ఞానముతో ఈ ఉత్పత్తులు సమృద్ధం చేయబడ్డాయి.
“కస్టమర్-కేంద్రిత దృష్టి అనేది అతిముఖ్య అంశముగా జరిగిన ఈ కార్యక్రమంతో, కస్టమర్లకు అత్యుత్తమ-శ్రేణి, 360-డిగ్రీల పరిష్కారాలను అందించుటలో మేము మా తిరుగులేని నిబద్ధతను ప్రదర్శించాలని ఆశించాము”, అన్నారు క్యాటర్పిల్లర్ యొక్క ప్రపంచ నిర్మాణ మరియు మౌలిక సదుపాయాల విభాగం సేల్స్ మరియు మార్కెటింగ్ ఇండియా డైరెక్టర్ శ్రీ ముకుల్ దీక్షిత్ గారు. “ప్రదర్శన మీద ఉన్న మా తర్వాతి-తరం ఎక్స్కవేటర్లు ఉత్పాదకత గరిష్టం చేయడానికి మరియు వారి బిజినెస్ వ్యవహారాల్లో ప్రభావశీలతను పెంచడానికి సహాయపడేలా రూపొందించబడ్డాయి.”
ఈ కార్యక్రమంలో కస్టమర్లు అత్యాధునిక క్యాటర్పిల్లర్ సాంకేతిక పరిజ్ఞానాలను కూడా పరిశీలించి చూసుకోవచ్చు. కస్టమర్లు తమ భారీ ఉత్పాదనను మరియు వ్యయ లక్ష్యాలను సాధించడానికి సహాయపడటంలో పనితీరుపై పరిమితిని మరియు ఇంధన సామర్థ్యమును పెంచడం ద్వారా ఈ అందజేతలు విస్తృత శ్రేణి పని ఆవశ్యకతలను సానుకూలపరచడానికి నిర్మించబడ్డాయి. తక్కువ స్వంతదనం మరియు తక్కువ ఆపరేటింగ్ ఖర్చులు మరియు వాడకానికి సులభంగా ఉండే క్యాటర్పిల్లర్ టెక్నాలజీతో, ఈ ఎక్స్కవేటర్లు కస్టమర్లు అనుకున్న స్థాయిలో మరియు అనుకున్న సమయానికి టన్నుల కొద్దీ పని జరగడానికి సహాయపడతాయి.
క్యాట్ 350 ఎక్స్కవేటర్ – గిరాకీ ఉన్న వాడుక పనుల కోసం అధిక ఉత్పాదకత మరియు స్వల్ప ఆపరేటింగ్ వ్యయం
- ఎక్కువ త్రవ్వకపు బలం మరియు స్వింగ్ టార్క్, పెద్ద సైజు బకెట్ తిరిగే విడత సమయాన్ని తగ్గిస్తుంది మరియు పేలోడ్ గరిష్టం చేస్తుంది.
- అత్యధిక సమర్థతతో కూడిన ఎలెక్ట్రో-హైడ్రాలిక్ సిస్టమ్ మరియు దీర్ఘ- కాలం మన్నిక ఉండే ఫిల్టర్లు ఆపరేటింగ్ ఖర్చుల్ని తగ్గిస్తాయి.
- పునరుద్ధరించబడిన స్వరూపం సర్వశ్రేష్టమైన మన్నికను సాధిస్తుంది.
- సముద్రమట్టానికి ఎగువన 4,500మీ (14,764 అడుగుల) వరకూ కఠినమైన పరిస్థితుల్లో మద్దతునిచ్చే పని వ్యవహారాలు.
- 52°C (125°F) యొక్క ప్రామాణిక అధిక-పరిసర ఉష్ణోగ్రత సామర్థ్యము మరియు -18°C (0°F) యొక్క ప్రామాణిక చల్లదనపు స్టార్ట్ సామర్థ్యము. విపరీతమైన పరిస్థితుల కోసం ఐచ్ఛికమైన -32°C (-25°F) చల్లదనపు స్టార్ట్ సామర్థ్యము అందుబాటులో ఉంటుంది.
క్యాట్ 374 & 395 ఎక్స్కవేటర్లు – 2 రెట్లు ఎక్కువ నిర్మాణాత్మక మన్నిక మరియు తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులతో గొప్ప ఉత్పాదకత
- మునుపటి మోడల్స్ తో పోల్చి చూస్తే 10% అధిక స్వింగ్ వరకూ మరింత త్వరగా లోడ్ చేస్తాయి. అదనంగా, అంకితమైనట్టి హైడ్రోస్టాటిక్ స్వింగ్ సర్క్యూట్ ఉత్పాదకత మరియు ప్రభావశీలతను పెంచుతుంది.
- బూమ్, స్టిక్, మరియు ఫ్రేమ్ లు అన్నీ మునుపటి మోడల్స్ తో పోల్చి చూస్తే రెండింతలు ఎక్కువ బలమైనవి.
- మునుపటి మోడల్స్ తో పోల్చి చూస్తే 20% వరకూ తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు.
“ఇండియాలో సుదీర్ఘ కాలంగా ఉంటున్న క్యాటర్పిల్లర్ యొక్క డీలర్లలో ఒకరుగా, మేము ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను అందిస్తాము మరియు కస్టమర్ ఆవశ్యకతను తీర్చే పరిష్కారాలకు మద్దతునిస్తాము. మేము బై బ్యాక్, ట్రేడ్-ఇన్లు, పరికరాలను అద్దెకు ఇవ్వడం, వాడిన మెషీన్ల అమ్మకం మరియు పొడిగించబడిన లైఫ్ ప్రోగ్రాములు వంటి భారీ శ్రేణి పరిష్కారాలను అందిస్తాము. కస్టమర్ల ఆకాంక్షలను అధిగమించడానికి గాను మేము కొత్తవాటిని అనుసరించడం ద్వారా సుస్థిరంగా మాకు మేము పునః నిర్వచించుకుంటాము” అన్నారు Gmmco లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఈఓ శ్రీ వి. చంద్రశేఖర్ గారు.
కస్టమర్లు తర్వాతి తరం క్యాట్ ఎక్స్కవేటర్ల బలాలను ప్రత్యక్షంగా వీక్షించగా, క్యాటర్పిల్లర్ మరియు Gmmco వారిచే నిర్వహించబడిన కస్టమర్ల సమావేశము ప్రతిధ్వనించిన విజయంగా కనిపించింది.






