Payal Shankar: కాంగ్రెస్ ఎప్పుడూ ఇచ్చిన మాట మీద నిలబడలేదు: పాయల్ శంకర్

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చూస్తుంటే బీసీలను మోసం చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్(Payal Shankar) పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్డినెన్సు తీసుకురాకుండానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసినట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఇచ్చిన మాట మీద నిలబడలేదు. బీసీ రిజర్వేషన్లకు మతపరమైన అంశాన్ని జోడిరచారు. మతపరమైన రిజర్వేషన్లను రాజ్యాంగం, సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించవు. శాసనసభ (Legislative Assembly) సమవేశాలు ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్ (BC Reservation) ఏ విధంగా అమలు చేస్తారో చర్చించాలి. ఈ వ్యవహారంలో న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా, బీసీలకు అన్యాయం జరగకుండా, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి అని డిమాండ్ చేశారు.