బీఆర్ఎస్ కు షాక్….కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే

బీఆర్‌ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు చెందిన నేతలు పాల్గొన్నారు.