సోనియా, రాహుల్ తో వైఎస్ షర్మిల భేటీ

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, భవిష్యత్తు ప్రణాళికలు, కార్యాచరణపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. రానున్న రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ పునర్వైభవం సాధించి, బలీయమైన శక్తిగా అవతరించే దిశగా మరిన్ని అడుగులు పడనున్నాయని షర్మిల వెల్లడించారు.