White Ration Cards: అర్హులకే తెల్ల రేషన్ కార్డులు: కేవైసీతో ప్రభుత్వం కఠిన నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో దాదాపు కోటీ యాభై లక్షల కుటుంబాలు తెల్ల రేషన్ కార్డుదారులుగా ఉన్నట్లు అంచనా. అయితే వీటిలో చాలామంది అర్హత లేనివారే కార్డు పొందినట్టు ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వాల్లో కొన్ని కారణాల వల్ల అనర్హులు కూడా కార్డులు పొందినట్టు సమాచారం. ఇప్పుడు ప్రభుత్వం (government) ఈ వ్యవస్థను శుద్ధి చేయడానికి కేవైసీ (KYC) ప్రక్రియను ప్రారంభించింది.
ఇప్పటి నుంచి తెల్ల రేషన్ కార్డు (white ration card) కొనసాగాలంటే కేవైసీ తప్పనిసరి అయింది. మొదట మార్చి 31 వరకూ గడువు ఇచ్చినా, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు దానిని ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. ఈ నెలాఖరుతో ఆ గడువు ముగియనుంది. ఇకపై కేవైసీ చేసినవారికే కార్డు కొనసాగుతుంది. కానీ ఈ కేవైసీలో ఆధార్ (Aadhaar), చిరునామ, బ్యాంక్ ఖాతా , ఆస్తులు , విద్యుత్ వినియోగం వంటి వివరాలు తీసుకుంటున్నారు. దీని ద్వారా ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అన్నది స్పష్టమవుతుంది.
కేవైసీలో స్థానిక చిరునామా ఉన్నవారికే (local residents) అవకాశం ఉంటుంది. అంటే వాస్తవంగా ఏపీలో నివసించే వారు మాత్రమే లబ్ధిదారులుగా కొనసాగుతారు. ఇతర రాష్ట్రాల్లో ఉండే వారు కానీ, ఏపీలో తెల్ల కార్డు తీసుకుని ప్రయోజనాలు పొందే వారు కానీ ఇకపై ఆ హక్కు కోల్పోతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు (government employees), పన్ను చెల్లించే వారు (tax payers), కారు (car) కలిగిన వారు, నెలకు 300 యూనిట్లకుపైగా విద్యుత్ వినియోగించే వారు కూడా కార్డు పొందే అర్హత కోల్పోతారు.
ఈ పరిణామాలతో చాలా మందిలో భయం మొదలైంది. తమ కార్డులు నిలబడతాయా అనే అనుమానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా కూడా ప్రభుత్వం చెప్పే విషయం ఒక్కటే — అసలైన పేదలకు అన్యాయం జరగదు. వారికి కార్డు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెబుతోంది. అలాగే కేవైసీ పూర్తయినవారికి జూన్ నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు (smart ration cards) పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇవి ఆధునిక విధానంలో రూపొందించి బహుళ ప్రయోజనాల కోసం వినియోగించేందుకు అనుకూలంగా ఉంటాయి. ఈ కేవైసీ ముగిశాక అసలైన తెల్ల కార్డుదారుల సంఖ్య ఏపీలో ఎంతమంది అన్నది తేలిపోతుంది. నకిలీ కార్డుదారులు (fake beneficiaries) బయటపడి, ప్రభుత్వ ఖజానాపై ఉండే భారం తగ్గే అవకాశముంది. దీని వల్ల సంక్షేమ పథకాలు నిజంగా అర్హులైనవారికి మాత్రమే చేరేలా మారుతుందని ప్రభుత్వ వర్గాలు (government sources) భావిస్తున్నాయి.