విశాఖలో టూరిజం ఇన్వెస్టర్ ల సమావేశం
ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇన్వెస్టర్ల మీట్, ఏపీ ట్రావెల్ మార్ట్ నిర్వహణకు సచివాలయంలో పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజాను కలిసి ప్రతిపాదనలు ఇచ్చినట్లు ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ తెలిపారు. విశాఖ వేదికగా జూన్లో టూరిజం ఇన్వెస్టర్ల సమావేశం, ఆగస్టులో తిరుపతి వేదికగా ట్రావెల్ మార్ట్ నిర్వహించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. అనంతరం పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ను కలిసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీటీడీసీ చైర్మన్ ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, ఏపీ చాంబర్స్ ప్రతినిధులు తరుణ్ కాకాణి, విజయమోమన్ పాల్గొన్నారు.






