స్విమ్స్ కు భారతీయుడు విరాళం..

తిరుమల తిరుపతి దేవస్థానం ఆద్వర్యంలోని తిరుపతిలో ఉన్న స్విమ్స్ అనుబంధ పద్మావతి మహిళ వైద్య కశాళాల వైద్యసిబ్బందికి విదేశాల్లో స్థిరపడిన భారతీయుడు భారీ విరాళం అందజేశాడు. 2,12,800 రూపాయలు విరాళాల చెక్కులను దాత గల్ఫ్ ఐనా కతర్‍లోని దోహాలో స్థిరపడిన సురె వెంకటసత్యనారాయణ అందించాడు. ఆయన కుమార్తె ఎస్.సాయిప్రియ తిరుపతి పద్మావతి మహిళ వైద్యకళాలలో ఫైనలియర్ ఎంబీబీఎస్ చదువుతోంది. ఇటీవల కరోనా వైరస్ రెండో దశవ్యాప్తిలో బాగంగా పద్మావతి మహిళ వైద్యకళాశాల, స్విమ్స్ ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బంది విశేష సేవలందిస్తున్నారు. ఈ సేవలకు గుర్తింపుగా ఈ విరాళాలతో 40 వేల సర్జికల్ గ్లౌజెస్ కొనుగోలు చేయాలని కోరారు. వైద్య సేవకుల సేవలను గుర్తించి విరాళాలిచ్చిన భారతీయుడు దాత వెంకట సత్యనారాయణను స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, పద్మావతి వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శరన్ బి.సింగ్ అభినందించారు.