ప్రీ-టీన్ విశ్వ సుందరి పోటీలో రాణించిన ప్రీతి పట్నాయక్
అంతర్జాతీయ స్థాయి ప్రీ-టీన్ అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గజపతినగరానికి చెందిన గర్భాం ప్రీతి పట్నాయక్ మెరిశారు. రెండు రోజుల క్రితం బ్యాంకాక్‌లో జరిగిన ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 40 మంది పాల్గొనగా, ప్రీతి మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఫ్యాషన్ రన్‌వే ఇంటర్నేషనల్ సంస్థ జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్-2024 పేరుతో పోటీలను నిర్వహించింది. నిర్వాహక సంస్థ ప్రతినిధి అరుణ్రత్న టైటిల్‌ను అందించారు. 12 ఏళ్ల ప్రీతి ఆరేళ్లుగా మోడల్‌గా పని చేస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు అనిత, ప్రసాద్ పట్నాయక్ విశాఖలో ఉంటున్నారు.






