రాజమండ్రిలో నూతన స్టోర్ ప్రారంభించిన పీఎంజే జ్యువెల్స్
దక్షిణ భారతదేశంలో అత్యంత ఇష్టపడే ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ అయిన పీఎంజే జ్యువెల్స్, మునుపెన్నడూ చూడని అత్యుత్తమ శ్రేణి, అతిపెద్ద బ్రైడల్ డిజైనర్ డైమండ్, గోల్డ్, పోల్కీ ఆభరణాల కలెక్షన్ ను ప్రదర్శిస్తూ రాజమండ్రిలో తన కొత్త స్టోర్‌ను ప్రారంభించింది. ఇది దక్షిణ భారతదేశంలో పీఎంజే 28వ స్టోర్. బ్రాండ్ యొక్క విస్తరణ ప్రణాళికలలో భాగంగా APలో 15వ స్టోర్.
పీఎంజే జ్యువెల్స్ డీ2హెచ్ వెర్టికల్ హెడ్ రామ్‌రెడ్డితో పాటు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే శ్రీమతి ఆదిరెడ్డి భవాని, కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, ఐఏఎస్ అధికారి శ్రీమతి డా. మాధవి లత, రుడా చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి ప్రారంభోత్సవానికి హాజరయ్యి వారి అభినందనలని తెలియజేసారు. ప్రారంభోత్సవ సమయంలో పీఎంజే నమ్మకమైన కస్టమర్లచే ఎలైట్ షో రూమ్ కిక్కిరిసిపోయింది.
ఆకట్టుకునే ఆభరణాల కలెక్షన్ తో పాటు, స్టోర్ తన కస్టమర్ల షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి అనేక రకాల సేవలను కూడా అందిస్తుంది. పీఎంజే అత్యుత్తమ & మునుపెన్నడూ చూడని డిజైనర్ ఆభరణాల శ్రేణి హస్తకళాకృతులతో పాటు ప్రాంత నిర్దిష్ట & వివాహ ఆభరణాలు, ఆఫీసు, పార్టీ, రోజువారీ ఉపయోగం కోసం సాధా రణ రోజువారీ దుస్తులకు తగిన తేలికపాటి క్రియేషన్లు స్టోర్ కలెక్షన్ లో భాగం కానున్నాయి.
వివాహ ఆభరణాల కలెక్షన్, స్టోర్ ప్రారంభోత్సవం గురించి రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీమతి ఆదిరెడ్డి భవాని మాట్లాడుతూ, ‘‘పీఎంజే ఆభరణాల కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. రాజమండ్రి ప్రజలు తమ కలెక్షన్ లో ఈ ఆభరణాలను కలిగి ఉండటానికి ఇష్టపడతారని నేను కచ్చితంగా చెప్పగలను. మా నగరం, మా ప్రజలు స్టోర్‌ని సందర్శించిన ప్రతిసారీ మంత్రముగ్ధులను చేసే అనుభూతిని పొందాలని భావించిన మొత్తం పీఎంజే జ్యువెల్స్ బృందానికి మా హృదయపూర్వక అభినందనలు. పీఎంజే జ్యువెల్స్ తమ కస్టమర్లకు శాశ్వతమైన అనుభవాన్ని అందిస్తానని వాగ్దానం చేసింది, ఒక కస్టమర్‌గా నేను ఈ స్టోర్ రాజమండ్రిలోని ఆభరణాల ప్రియులందరినీ ఆకర్షించగలదని చెప్పగలను” అని అన్నారు.
స్టోర్ ప్రారంభోత్సవంపై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ‘‘రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకోదగ్గ సాంస్కృతిక, సం ప్రదాయ వారసత్వంతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. 5000 చ.అ.ల విస్తీర్ణంలో వి స్తరించి ఉన్న ఈ కొత్త స్టోర్ 2 అంతస్తుల భవనం. ఇందులో పెళ్లికూతుళ్ల వజ్రాలు, బంగారం, పోల్కీ ఆభరణాల క లెక్షన్ లో మేం మునుపెన్నడూ చూడని అత్యుత్తమ శ్రేణిని ప్రదర్శిస్తున్నాం. మేం ఆతిథ్యంలో అపారమైన ఆనం దాన్ని పొందుతాం. నగరంలోని ఆభరణాల ప్రేమికులు వాటికోసం మా వద్దకు రావడాన్ని ఇష్టపడుతాం. రాజమం డ్రి, చుట్టుపక్కల ఉన్న ఆభరణాల ప్రేమికులు ఈ కొత్త స్టోర్‌లో మా తాజా డిజైన్లను ఇష్టపడతారు. షోరూమ్‌ని సం దర్శించే మా కస్టమర్లందరికీ మేం అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాం. మేం సమీప భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్ అంతటా పీఎంజే జ్యువెల్స్ ఉనికిని విస్తరించాలని చూస్తున్నాం’’ అని పీఎంజే జ్యువెల్స్ డీ2హెచ్ వెర్టికల్ హెడ్ శ్రీ రామ్ రెడ్డి అన్నారు.
ఇతర అతిథులు కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, ఐఏఎస్ అధికారి శ్రీమతి డా. మాధవి లత, రుడా చైర్మన్ మేడ పాటి షర్మిలా రెడ్డి కూడా పిఎంజె జ్యువెల్స్ అద్వితీయమైన కలెక్షన్స్ ను ప్రశంసించారు. పీఎంజే జ్యువెల్స్లోని ప్రతి ఆభరణం సంప్రదాయం, ఆధునికతల సమ్మేళనంగా, అత్యంత ప్రేమ, అభిరుచితో భారతదేశంలో రూపొందించబడింది. పీఎంజే ప్రదర్శించే డిజైన్లు భారతీయ స్వర్ణకారుల అద్భుతమైన నైపుణ్యాలను ప్రతిబింబిస్తాయి. పీఎంజే జ్యువెల్స్ భారతీయ ఆభరణాల పరిశ్రమలో ఒక ప్రసిద్ధ బ్రాండ్. తన నాణ్యమైన ఉత్ప త్తులు, అద్భుతమైన కస్టమర్ సేవకు ప్రసిద్ధి. ఈ బ్రాండ్ 50 సంవత్సరాలకు పైగా ఈ వ్యాపారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బలమైన ఉనికిని కలిగి ఉంది. రాజమండ్రిలోని కొత్త స్టోర్ తన వినియోగదారులకు అత్యుత్తమ ఉత్పత్తులు, సేవలను అందించడంలో బ్రాండ్ నిబద్ధతకు నిదర్శనం.






