Pawan Kalyan: మానవీయతకు ఆదర్శంగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయం..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలలో తన ప్రత్యేకమైన మానవతా దృక్పథంతో ఎప్పుడూ ప్రజల మనసులు గెలుచుకుంటారు. ఆయన వ్యవహార శైలి సాధారణ రాజకీయ నాయకుల కంటే వేరుగా ఉండటమే కాదు, ప్రతి వర్గానికీ సానుభూతి చూపించడంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. గిరిజనులు, వెనుకబడిన వర్గాలు మాత్రమే కాకుండా ఆయన దృష్టి ఎల్లప్పుడూ సమగ్రత మీద ఉంటుంది.
ఇటీవల జరిగిన ఒక సంఘటనలో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మరోసారి స్పష్టమైంది. వైసీపీ (YCP ) పార్టీకి చెందిన సర్పంచులు పంచాయతీ రాజ్ (Panchayati Raj) శాఖకు చెందిన సమస్యలతో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. గత ప్రభుత్వంలో తాము ఎదుర్కొన్న నిధుల కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎన్డీఏ (NDA) ప్రభుత్వం నుండి సహాయం కోరారు.
ఈ పరిస్థితిని గమనించిన పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు. ఆ సర్పంచులను పిలిచి అధికారులతో ఒక ఇంటరాక్టివ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. వారి సమస్యలు ఒక్కొక్కటిగా విని.. సమాధానాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇక్కడితో ఆగకుండా ఆయన మరింత మానవీయత ప్రదర్శించారు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన సర్పంచులకు ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. ఈ చిన్న చర్యలోనూ ఆయన దాతృత్వం ప్రతిఫలించింది.
సాధారణంగా అధికారంలో ఉన్న నాయకులను కలవడానికి ప్రతిపక్షానికి చెందిన వారు వస్తే వారిని పెద్దగా పట్టించుకోరు. సమావేశం జరిగిందా లేదా అనేది కూడా ప్రశ్నగా మిగిలిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఆ సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించారు. ఆయన దృష్టిలో సమస్య చెప్పినవారు ఏ పార్టీకి చెందిన వారన్నది ప్రధాన విషయం కాదు, వారిని ఒక పౌరుడిగా చూడడం ముఖ్యమని అన్న విషయం తన ప్రవర్తనతో చూపించారు.
ఈ విధానం వల్ల అక్కడికి వచ్చిన సర్పంచులు కొత్త ఉత్సాహం పొందారు. రాజకీయ విభేదాలను మించి తమ మాట వినిపించుకునే అవకాశం దొరికిందన్న ఆనందం వ్యక్తం చేశారు. గత పాలనలో ఎదురైన సమస్యలు చెప్పడానికి ఎవ్వరూ ముందుకు రాలేదని వారు గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకంటే మానవీయతను ముందు ఉంచుతారు అన్న విషయం ఈ సంఘటనతో మరొకసారి స్పష్టమైంది.ఆయనతో జరిగిన ఈ సమావేశం వైసీపీ సర్పంచులకే కాకుండా మొత్తం రాష్ట్రానికి “అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యలు వినాలి, సాధ్యమైనంతవరకు పరిష్కరించాలి అన్న దృక్పథం మాత్రమే ప్రజా నాయకుడికి స్థిరమైన గుర్తింపు తెస్తుంది” అన్న సందేశం ఇచ్చింది.







