Nara Lokesh: పారమట్టా లార్డ్ మేయర్ మార్టిన్ జైటర్ తో మంత్రి లోకేష్ భేటీ

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన నగరాల అభివృద్ధికి సహకరించండి
ఆస్ట్రేలియా (సిడ్నీ): గ్రేటర్ సిడ్నీలో కీలక నగరం పారమట్టా లార్డ్ మేయర్ మార్టిన్ జైటర్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పారమట్టాలో స్థానిక వ్యాపారాలను పెంచడం, పెట్టుబడులను ఆకర్షించి గ్లోబల్ సిటీగా మార్చడంలో జైటర్ కృషిని మంత్రి లోకేష్ ప్రశంసించారు. ప్రజారవాణా, గ్రీన్ స్పేసెస్ ను అభివృద్ధి చేయడంలో చొరవ చూపిన జైటర్, పారమట్టా స్క్వేర్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. గత 20 సంవత్సరాలుగా లోకల్ గవర్నెన్స్, కమ్యూనిటీ డెవలప్ మెంట్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సార్టప్ స్టేట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన నగరాల అభివృద్ధికి సహకారం అందించాల్సిందిగా కోరారు. అనంతరం హారిస్ పార్కులో లిటిల్ ఇండియా పేరుతో ఏర్పాటు చేసిన రివర్ సైడ్ ఫుడ్ కోర్టును సందర్శించారు.