ఆంధ్రప్రదేశ్ ప్లాంట్ నుంచి ..తొలి కియా కారెన్స్ ఉత్పత్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం లోని కియా ప్లాంటు నుంచి కారెన్స్ తొలికారు బయటకు వచ్చినట్లు సంస్థ తెలిపింది. త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్న మూడు వరుసల సీట్ల కారు కారెన్స్ ఉత్పత్తిని కియా ఇండియా ప్రారంభించింది. ఈ రిక్రియేషన్ వాహనంతో కొత్త విభాగాన్ని సృష్టిస్తున్నట్లు కియా ఇప్పటికే తెలిపింది. త్వరలోనే ఈ కారును విపణిలోకి అందుబాటులోకి తీసుకొస్తామంది. ఇప్పటికే కానెర్స్ ప్రీ-బుకింగ్లను ప్రారంభించింది. ఆధునిక వినియోగారుల కుటుం అవసరాలకు అనుగుణంగా ఈ వాహనాన్ని తీసుకొస్తున్నట్లు కియా ఇండియా ఎండీ సీఈఓ టే జిన్ పార్క్ అన్నారు. ఇక్కడి నుంచి ఎగుమతులూ చేస్తామని వెల్లడిరచారు. కియా ఇండియా నుంచి వస్తున్న నాలుగో మోడల్ ఇది అని తెలిపారు.






