కడప నుంచి ఇండిగో సేవలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా నుంచి ఇండిగో విమాన సంస్థ అయిదు నగరాలకు సర్వీసులను నడపనుంది. మార్చి 27 నుంచి చెన్నై, విజయవాడ, హైదరాబాద్, మార్చి 29 నుంచి విశాఖపట్నం, బెంగళూరులకు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇండిగో సర్వీసులు అందిస్తున్న నగరాల్లో కడప 73వది. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా విమాన పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. కరోనా నుంచి కోలుకునే సమయంలో ఫ్యూయల్ ధరల పిడుగుపడిరది. దీంతో ఏవియేష్ సెక్టార్ ఇప్పుడిప్పుడే గాడిన పడదు అనే వాదనలు వినిపించాయి. కానీ కడప లాంటి టైర్ త్రీ సిటిస్లో కూడా తిరిగి విమాన సర్వీసులు ప్రారంభం కావడం ఏవియేషన్ సెక్టార్ త్వరగా కోలుకుంటుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది.






