కడప నుంచి చెన్నైకి ఇండిగో సర్వీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప నుంచి విజయవాడ, చెన్నైలకు ఇండిగో విమాన సర్వీసులు నడిపేందుకు ఆ సంస్థ ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీసీఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకు ఈ మార్గాల్లో విమానాలు నడిపిన ట్రూజెట్ సంస్థ తాము సర్వీసులు నడపలేమని ఒప్పందం రద్దు చేసుకోవడంతో ఇండిగోకు అవకాశం కల్పించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థకు వయబిలిటి గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కింద రూ.20 కోట్లు చెల్లించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇండిగో సంస్థ మార్చి 27 నుంచి వారానికి నాలుగు విమానాలను చెన్నై`కడప, విజయవాడ` కడప మధ్య నడపనుంది.






