కాకినాడ తీరంలో అమెరికా నావికాదళం
కాకినాడ తీరానికి అమెరికా నావికాదళాలు చేరుకున్నాయి. నేటి నుంచి కాకినాడ తీరంలో భారత్, అమెరికా దేశాల సంయుక్త నావికాదళ విన్యాసాలు జరగనున్నాయి. ఆరురోజుల పాటు నిర్వహించనున్న ఈ విన్యాసాల్ని టైగర్ ట్రంప్‌గా పేర్కొంటారు. కాకినాడ తీరంలోని పాత ఎన్టీఆర్ బీచ్, నేవల్ ఎల్క్లేవ్లలో నేవీ, ఆర్మీ సంయుక్త విన్యాసాల్ని జరుపుతారు. ఇందుకోసం అమెరికా నావికాదళ అధికారులు కాకినాడకొచ్చారు. అమెరికా యుద్దనౌకలు కూడా ఇక్కడికి రానున్నాయి. ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా రక్షణ బలగాలకు చెందిన 800 మంది సిబ్బంది పాల్గొంటారు. యుద్ధనౌకలు, యుద్ద ట్యాంకుల్తో వీరు విన్యాసాలు నిర్వహిస్తారు. భారత భూభాగంలో సముద్ర మార్గంలో ఉగ్రవాదులు, శత్రువులు చొరబడే సమయంలో వార్ని ఎదుర్కొనే తీరును వీరు ప్రదర్శిస్తారు. భారత్‌లో ఉగ్రవాద నిర్మూలనకు భారత్ అమెరికాలు సంయుక్తగా కట్టుబడుండడంత కాకినాడను ఈ విన్యాసాలకే కేంద్రంగా ఎంపిక చేశారు. ఇదే సందర్భంలో శత్రుదేశాల్తో యుద్ధ సమయంలో నిర్వహించే విన్యాసాల్ని కూడా వీరు ప్రదర్శిస్తారు.






