ఆస్ట్రేలియా క్రికెటర్ ను ఆకర్షించిన హనుమాన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖనగరంలోని హనుమంత వాక జంక్షన్ వద్ద మేయర్ హరివెంకటకూమారి చొరవతో ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహం ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను అమితంగా ఆకట్టుకుంది. ఆన్ మై డ్రైవ్ అరౌండ్ టౌన్ టూడే వైజాగ్ అనే టాగ్ లైన్ తో కొంత కాలం క్రితం క్రికెటర్ డేవిడ్ వార్నర్ పెట్టిన ఇన్ట్సాగ్రామ్ పోస్టుకు విశేష స్పందన వస్తోంది. సుమారు 4,32,606 మంది ఇప్పటికీ ఈ పోస్టును వీక్షించారు. ఈ సందర్భంగా వేలమంది జై హనుమాన్ అని కామెంట్స్ పెట్టారు. దీనితో విశాఖ నగర హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని విశాఖ వాసులు ఆనందం వ్యక్తం చేశారు.






