ఏపీలో 1717కి చేరిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 67 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1717కి చేరింది. ఇప్పటి వరకు 589 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 34 మంది మృతి చెందారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 1094 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా కర్నూలులో 25 కేసులు ఉన్నాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 516కు చేరుకున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,263 శాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ్టి 67 పాజిటివ్ కేసుల్లో గుజరాత్ నుంచి వచ్చిన 14 మంది ఉన్నారు.






