ఏపీఎండీసీ సరికొత్త రికార్డ్.. అమెరికా మార్కెట్లో
బెరైటీస్ ఎగుమతుల్లో ఏపీఎండీసీ ( ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ) సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికా బెరైటీస్ మార్కెట్లో 44 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఈ మేరకు అంతర్జాతీయ బెరైటీస్ అసోసియేషన్ వెల్లడిరచింది. అమెరికా మార్కెట్ లో ఒక దేశం గానీ, సంస్థ గానీ ఇంత శాతం వాటాను చేజిక్కించుకోవడం ఇదే తొలిసారి. గత సంవత్సరం 30 శాతం వాటాను దక్కించుకున్న ఏపీఎండీసీ, ఈ సంవత్సరం దాన్ని మరో 14 శాతం పెంచుకుని ప్రపంచ మార్కెట్లో సుస్థిర స్థానం సాధించింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం 3 మిలియన్ టన్నుల బెరైటీస్ ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకున్న ఏపీఎండీసీ దాన్ని సాధించింది. గత సంవత్సరం బెరైటీస్పై ఏపీఎండీసీకి రూ.900 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది అది రూ1,300 కోట్లకు పెరిగింది. బెరైటీస్ నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మంగంపేటలో విస్తారంగా ఉన్నాయి.






