ఏపీకి మరో దిగ్గజ కంపెనీ …. రూ.184 కోట్లతో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో దిగ్గజ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖలో అమెజాన్ సంస్థ తన డెవలప్మెంట్, ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఫెసిలిటీ సెంటర్ కోసం విశాఖలో రూ. 184.12 కోట్ల పెట్టుబడిని తీసుకురానున్నట్లు పకటించింది. ఈ మేరకు అమెజాన్ పెట్టుబడుల కోసం ప్రాథమిక నిర్ణయం పూర్తి చేసుకొని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్స్క్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకుంది. 2023లో ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు పనులు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వానికి వివరించింది. అమెజాన్ సంస్థ పెట్టుబడులపై సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా స్వయంగా తెలిపింది. డెవలప్మెంట్ సెంటర్, ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుతో ఐటీ ఉద్యోగాలతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ప్రస్తుతం విశాఖలో విప్రో, టెక్ మహీంద్రా, కండ్యూయెంట్, మిరాకిల్ సిటీ వంటి సంస్థలు ఇక్కడే ఏర్పాటయ్యాయి.






