ఏపీలో రూ.250 కోట్ల పెట్టుబడులుతో అమర రాజా కొత్త ప్లాంట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమర రాజా గ్రూప్ 250 కోట్లతో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. అమర రాజా గ్రూప్‌కు చెందిన మంగల్ ఇండస్ట్రీస్ చిత్తూరు జిల్లా పూతల పట్టు మండలం తెనెపల్లి వద్ద ఉన్న మంగళ్ ఇండస్ట్రీయల్ కాంపెక్ల్స్ లో నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. కొత్త ప్లాంట్‌ను 2.15 లక్షల చదరపు అడుగుల వైశ్యాలంలో నిర్మించనున్నారు. డిజైన్ ఆధారిత తయారీ కంపెనీ అయిన మంగల్ ఇండస్ట్రీస్‌లో ఆటో విడిభాగాలు, మెటల్ ప్యాబ్రికేషన్, బ్యాటరీ విడిభాగాలు, టూల్ వర్క్స్, స్టోరేజీ పరిష్కారాలు, కస్టమ్ ప్యాబ్రికేషన్ వంటి విభాగాలతో పని చేస్తున్నది. దేశంలో అనేక పెద్ద బ్రాండ్లు ఈ కంపెనీ కస్టమర్లుగా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ 3 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తయారీ కార్యకలాపాలను వృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని అమర రాజా గ్రూప్ కో ఫౌండర్ గల్లా జయదేవ్ తతెలిపారు. కొత్త పెట్టుబడి ద్వారా స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు గణీయంగా పెరుగుతాయని తెలిపారు.






