మాకూ ఓ మోడీ కావాలి…
పాక్ ప్రజల మనోగతం ప్రపంచవ్యాప్తంగా మోడీ ఓ బ్రాండ్.. ఓ అంతర్జాతీయ నేత. సంక్షోభంతో ప్రపంచం అతలాకుతలమవుతున్న వేళ.. దాన్ని స్థిరంగా ఉంచే ఓ స్థిరమైన నేత కావాలి. అతడే భారత ప్రధాని మోడీ. భారత విదేశాంగ విధానాన్ని కొత్త పుంతలు తొక్కించిన ధీశాలి.పొరుగున ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కుప్పకూలుతున్న వేళ.. భారత దేశాన్ని సమస్యల పాలు కాకుండా చేసిన వ్యక్తి. ఈ మాటలు మనమంటున్నవి కావు.. భారత ప్రగతిని చూస్తూ..తమ దౌర్భాగ్యానికి తిట్టుకుంటూ పొరుగు దేశాలు చెబుతున్న మాటలివి. మాకు మోడీ లాంటి వ్యక్తి కావాలంటూ పోస్టులు సైతం పెడుతున్నారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో మోడీ అనుసరించిన విధానం ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుకుంది.
ఇజ్రాయెల్ పై హమాస్ దాడి సమయంలో.. యూదుదేశానికి మద్దతుగా నిలిచారు మోడీ. అయితే గాజాపై ఇజ్రాయెల్ దాడులను సైతం ఆయన ఖండించారు. అమాయకులు చనిపోవడం బాధాకరమన్నారు. ఈవిషయంపై ఇజ్రాయెల్ కు తమ విధానాన్ని సైతం తెలియపరిచారు. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఇరుదేశాలు మెచ్చుకునేలా ప్రవర్తించారు మోడీ. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో స్నేహం చెడకుండా.. అదే సమయంలో ఉక్రెయిన్ లో పర్యటించి జెలెస్కీ తోనూ మోడీ పర్యటన చారిత్రక ఘట్టమని ప్రకటించేలా చేశారు.దీంతో ప్రపంచం ఇప్పుడు మోడీని.. అంతర్జాతీయంగా బలమైన నేతగా చూస్తోంది.
ఇక పొరుగున ఉన్న పాక్ ప్రజలు, నేతలు.. మోడీని తలచుకోని రోజు ఉండడం లేదు.మనకు ఓ బలమైన నేత అంటే మోడీ లాంటి వ్యక్తి ఉండి ఉంటే.. ఈపరిస్థితిలో ఉండకపోదుము కదా అన్నది వారి బాధ. ఇన్నాళ్లు భారత్ ను తిడుతూ వచ్చిన వారే.. ఇప్పుడు మోడీ పాలన బాగుంది. భారత్ దూసుకుపోతోంది. మన పరిస్థితి మాత్రం దయనీయంగా తయారైందంటూ పోస్టులు పెడుతున్నారు. అజాద్ కశ్మీర్ లో ఓ వ్యక్తి అయితే.. మోడీజీ.. పాక్ ను దత్తత తీసుకోండంటూ కోరడం చాలా మందిని ఆకర్షించింది కూడా. భారత్ దూరదృష్టితో గతంలో తీసుకొన్న నిర్ణయాలు ఇపుడు ఫలాలు అందిస్తున్నాయని ప్రముఖ పాక్ – అమెరికన్ వ్యాపారవేత్త సాజిత్ తరార్ అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో భారత్ మరింత అభివృద్ధి చెందుతోందని, పాకిస్థాన్‌కు కూడా అటువంటి నేత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్‌తోపాటు అమెరికాలో పనిచేసే భారతీయులకు మోడీ ఇచ్చిన జాతీయవాద నినాదం ఎంతో ప్రయోజనం చేకూర్చింది. కొన్ని కీలక రంగాల్లో వారిదే పైచేయి. వాషింగ్టన్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. టెక్ దిగ్గజాల పెరుగుదల ప్రవాస భారతీయులను మరింత బలోపేతం చేస్తోంది. దీని నుంచి పాకిస్థాన్ పాఠాలు నేర్చుకొని.. విద్యపై ఎక్కువ దృష్టి పెట్టాలి’’ అన్నారు.భారత తొలి ప్రధాని నెహ్రూ, నాటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్‌ల ఆలోచనలకు అనుగుణంగా ఏర్పడిన ఐఐటీ, ఐఐఎంలు దీర్ఘకాల ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఇలా దీర్ఘకాల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పెడితే మంచి ఫలితాలే వస్తాయని ప్రశంసలు కురిపించారు.






