థాయ్ లాండ్ నూతన ప్రధాని పెటోంగాటర్న్ షినవత్రా..
థాయ్ లాండ్ కొత్త ప్రధానిగా పెటోంగాటర్న్ షినవత్రా బాధ్యతలు స్వీకరించారు.. తన తండ్రి తాక్సిన్, అత్త, మొదటి మహిళా ప్రధాని అయిన యింగ్లక్ షినవత్రా తర్వాత ఆ కుటుంబం నుంచి ప్రధాని అయిన మూడో వ్యక్తిగా పేటోంగాటర్న్ నిలిచారు. తన తండ్రికి మూడో సంతానంగా పెంగాటర్న్ షినవత్రా జన్మించింది. థాయ్ ఎన్నికలకు రెండు వారాల ముందే తను రెండో బిడ్డకు జన్మనిచ్చింది. అయినా కూడా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంది.
2006లో ఆమె తండ్రి తాక్సిన్ ను సైనిక తిరుగుబాటు ద్వారా తొలగించారు. ప్రభావంతమైన రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వారసురాలిగా వచ్చింది షినవత్రా. ఇక పేటాంగార్న్… రాజకీయాల్లోకి రాకముందు తమ కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలను చూసుకునేవారు. 2001లో ఫ్యూ థాయ్ పార్టీ ఇన్ క్లూజన్ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కమిటీ చీఫ్ గా నియమితులయ్యారు. ఆ సమయంలోనే అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తక్కువ సమయంలోనే ఆమె మంచి గుర్తింపు సాధించారు. తండ్రి వారసత్వం, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆమె సక్సెస్ కావడంతో తిరుగులేకుండా పోయింది.
షినవ్రతా కుటుంబం ఇప్పటికీ ఎన్నో రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆమె అత్త యింగ్లక్ .. చట్టపరమైన సమస్యలతో దేశం బయటే ఉండిపోయింది. ఆమె ప్రవాసంలో జీవిస్తోంది. ఇదే పెటోంగాటార్న్ రాజకీయ భవిష్యత్ కు కొంత ప్రమాదకరంగా మారే సూచనలున్నాయి. ఇక గత ప్రధాని స్రేత తావిసిన్ను తన క్యాబినెట్ లో నేర చరిత్ర కలిగిన న్యాయవాదిని నియమించిన కారణంగా ఆదేశ అత్యున్నత న్యాయస్థానం బాధ్యతల నుంచి తొలగించింది. ఇక ఆ తర్వాతే పేటోంగాటర్న్ నియామకం జరిగింది. ఇప్పటివరకు ఆ దేశ ప్రధానుల్లో అత్యంత పిన్నవయస్కురాలిగా నిలిచారు. ఇక 2006లో దేశం విడిచిన పెటోంగాటర్న్ తండ్రి …గతేడాదే థాయిలాండ్ కు తిరిగి వచ్చాడు. యూకేలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె ముందుగా రెండె హోటల్ సంస్థలో పనిచేశారు. 2021లోనే తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 2023లో పార్టీ నాయకురాలిగా ఎదిగారు.
ఇక ఆమె మాట్లాడుతూ శ్రెట్టా తవిసిన్ అంటే తమకు గొప్ప గౌరవం ఉందని పేర్కొన్నారు. ఇలా ఆయన పదవి కోల్పోవడం బాధించిందని చెప్పారు. ఏదేమైనా దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో దేశంలో మరింత మార్పును సాధిస్తామని, థాయ్ ప్రజల అభివృద్ధే తమ ధ్యేయమని చెప్పారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. అయితే 247 మంది సభ్యుల మద్దతు అవసరంగా ఉండగా 11 పార్టీల సంకీర్ణానికి సారథ్యం వహిస్తున్న వ్యూ థాయి పార్టీ అగ్రనేత పేటోంగాటర్న్ కు 314 మంది సభ్యులు మద్దతు ప్రకటించారు. దీంతో ఏకగ్రీవంగా ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ దేశ చరిత్రలో రెండో మహిళా ప్రధానిగా నిలిచారు.






