మోదీ ఆ ఒక్క పని చేయగలిగితే.. ఇక ఎక్కడికో వెళ్ళిపోతారు?
ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న భీకర యుద్ధం అందరికీ తెలిసిందే. నాటో కూటమిలో చేరే ప్రయత్నంలో రష్యా ఈ యుద్ధాన్ని ప్రారంభించింది. కూటమిలో భాగస్వామ్యులైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు మద్దతుగా బరిలోకి దిగాయి. నేరుగా యుద్ధం చేయకపోయినా ఆయుధాలు, మందుగుండి సామాగ్రి లాంటిది సప్లై చేస్తూ యుద్ధాన్ని పరోక్షంగా ఎగదోస్తున్నాయి. అయితే ఇన్ని దేశాలకు వ్యతిరేకంగా శాంతి పలుకులు పలుకుతున్న దేశం ఒక్క భారతదేశం మాత్రమే.
రష్యా తో భారత్కు గట్టి బంధమే ఉంది. అప్పుడు అమెరికా పాకిస్తాన్ కు సహాయంగా భారత్ పై యుద్ధానికి వస్తే రష్యానే అడ్డుకుంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు బాగా మారిపోయాయి. ఉక్రెయిన్ తో భారత్కు పెద్దగా అనుబంధం లేకపోయినప్పటికీ చాలామంది భారతీయ విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. అందుకే యుద్ధం మొదలైన క్షణం నుంచి భారత్ ఉక్రెయిన్-రష్యాలకు సర్దిచెబుతూనే ఉంది. అందుకే ఐక్యరాజ్యసమితిలో ఈ విషయంపై జరిగిన కీలకమైన ఓటింగ్ సందర్భంగా కూడా తన మాటను భారత్ ప్రభుత్వం ఎంతో స్పష్టంగా చెప్పింది. ఇటు ఉక్రెయిన్.. అటు రష్యా రెండిటిని యుద్ధం మొదలయ్యాక సందర్శించిన దేశాధినేత ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క మోదీ మాత్రమే. రష్యాకు దగ్గరగా ఉన్న మిగిలిన ఏ దేశాధినేతలూ, రష్యా ఎక్కడ వచ్చి తమ మీద పడిపోతుందో అన్న భయంతో ఉక్రెయిన్ సందర్శించే సాహసం చేయలేకపోతున్నాయి.
కానీ మోదీ మాత్రం ఆ పని చేయగలిగారు. తాజాగా ఉక్రెయిన్ పర్యటనలో రెండు దేశాల మధ్య చర్చకు ఒక స్నేహితుడిగా సాయం చేస్తానని ఆయన ప్రకటించారు. యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలని.. దీనివల్ల నష్టం తప్ప లాభం లేదని హితవు పలికాడు. అంతేకాదు ఇటీవల పుతిన్ కలిసినప్పుడు ఆయన కూడా యుద్ధం వద్దనే భావనతో ఉన్నారని మోదీ వెల్లడించారు. ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి శాంతికి శంకుస్థాపన చేయడానికి మోదీ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఈ పని మోదీ సాధించగలిగితే ప్రపంచ నాయకుడు అనే మాటకు నిర్వచనం గా మారిపోతారు.






