ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికా రాజకీయ అంశాలపై...

అమెరికా రాజకీయ అంశాలపై...

అమెరికా తెలుగు సంఘం (ఆటా) కాన్ఫరె న్స్‌లో భాగంగా అమెరికా రాజకీయ పరిస్థితులు, పాలసీ మేకింగ్‌లో భారత సంతతి వారికి ఉపయో గపడే విధంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

జూలై 2, శనివారం మధ్యాహ్నం 2.45 నుంచి మధ్యాహ్నం 3.45 వరకు యుఎస్‌ పాలసీ ఫోరం ఆధ్వర్యంలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మేరీ మిల్‌బెన్‌ (అమెరికన్‌, హాలీవుడ్‌ సింగర్‌, సినీనటి), మేధా జయశంకర్‌ (కో చైర్‌, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కౌన్సిల్‌, యుఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఫిలిం ప్రొడ్యూసర్‌), ప్రియా సమంత్‌ (సిఇఓ, కో ఫౌండర్‌ అబ్రిస్‌.ఐఓ), శ్రీలేఖ పల్లె (యుఎస్‌ పొలిటికల్‌ చైర్‌) పాల్గొంటున్నారు.

జూలై 2, శనివారం మధ్యాహ్నం 3.45 నుంచి 4.15 వరకు జరిగే ఈ కార్యక్రమంలో శ్రీలేఖ పల్లె (ఆటా యుఎస్‌ పొలిటికల్‌ ఫోరం చైర్‌), ఈషా నాగిరెడ్డి (యంగ్‌ డెమోక్రట్స్‌ క్లబ్‌ వ్యవస్థాపకురాలు, రాక్‌ రిడ్జ్‌ హైస్కూల్‌, కన్వర్స్‌ యూనివర్సిటీ), శ్రియ సామల (క్యాంపెయిన్‌, పొలిటికల్‌ అడ్వొకసీ), నయన సెలిన్‌ జేవియర్‌ (టీన్‌ టౌన్‌ హాల్‌ ప్రాజెక్ట్‌ వ్యవస్థాపకురాలు) పాల్గొంటున్నారు. జూలై 2 మధ్యాహ్నం 4.15 నుంచి 5 వరకు మరో కార్యక్రమాన్ని కూడా అమెరికన్‌ పాలిటికల్‌ ఫోరం పేరుతో ఏర్పాటు చేశారు. ఇందులో జే కన్సర (పిఆర్‌ కన్సల్టెంట్‌, కీ స్ట్రాటజిస్ట్‌ ఆఫ్‌ కాంగ్రెసెషనల్‌ క్యాంపెయిన్స్‌), బంగర్‌ రెడ్డి (2020 కాంగ్రెసెషనల్‌ క్యాండిడేట్‌ ఫర్‌ యునైటెడ్‌ స్టేట్స్‌ కాంగ్రెసెషనల్‌ డిస్ట్రిక్ట్‌ 22,), సంత్‌ గుప్తా (బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌, పొలిటికల్‌ యాక్టివిస్ట్‌) పాల్గొంటున్నారు. అంజన్‌ చిమలదిన్నె ఈ కార్యక్రమానికి మోడరేటర్‌గా వ్యవహరిస్తున్నారు.

 

Tags :