ASBL NSL Infratech

టీఆర్ఎస్ కు చేవెళ్ల ఎంపీ షాక్

టీఆర్ఎస్ కు చేవెళ్ల ఎంపీ షాక్

తెలంగాణ రాష్ట్ర సమితికి, చేవెళ్ల లోక్‌సభ స్థానానికి కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా చేశారు. ఇందుకు దారితీసిన పరిస్థితులను ప్రస్తావిస్తూ మూడు పేజీల లేఖను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు రాశారు. మంత్రి మహేందర్‌రెడ్డితో విభేదాలు, పార్టీలో పరిస్థితిపై ఆయన కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరగడంతోపాటు, రాజీనామా చేస్తారని కూడా ఊహాగానాలు వచ్చాయి. ఇద్దరు ఎంపీలు టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పనున్నారని కాంగ్రెస్‌ కార్యానిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొద్దిరోజుల క్రితం ప్రకటించడంతో ఇది మరోసారి చర్చ నీయాంశమైంది. ఆ మార్నాడే మంత్రి కేటీఆర్‌ ఎంపీ విశ్వేశ్వరరెడ్డితో చర్చించారు. ఈ సమావేశం తర్వాత విశ్వేశ్వరెడ్డి ఓ ప్రకటన విడుదల చేవారు. తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అందులో పేర్కొన్నారు తప్ప రాజీనామా చేయబోనని సృష్టం చేయలేదు. అయితే కేటీఆర్‌తో భేటీ తర్వాత విశ్వేశ్వరరెడ్డి రాజీనామా చేయకపోవచ్చని టీఆర్‌ఎస్‌ వర్గాలు కూడా భావించాయి. కానీ ఒకవైపు ముఖ్యమంత్రితో సహా నాయకులంతా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉండగా, అనూహ్యంగా ఆయన రాజీనామా చేశారు. విశ్వేశ్వరరెడ్డి రాజీనామా అంశం అటు టీఆర్‌ఎస్‌ వర్గాలతో పాటు ఇతర పార్టీల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

Tags :