ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

టిఎల్ సిఏ ఆద్వర్యంలో 71 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

టిఎల్ సిఏ ఆద్వర్యంలో 71 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం అధ్యక్షులు శ్రీ గూడూరు శ్రీనివాస్ ఆద్వర్యంలో ఆగష్టు 12 వ తేదీన న్యూయార్కు నగరంలో 71 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గూడూరు  శ్రీనివాస్ స్వాతంత్య్ర దినోత్త్సవం గురించి వివరిస్తూ, అందరు పాల్గొన్నందుకు కృతఙ్ఞతలు తెలియ చేశారు.vice ప్రెసిడెంట్ తాపీ ధర్మరావు గారు మరియు సెక్రటరీ అశోక్ చింతకుంట సభ్యులకు  స్వాతంత్య్ర దినోత్త్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. TLCA ధర్మకర్తల మండలి సెక్రటరీ ముత్యాల వెంకటేష్ మాట్లాడుతూ మనం కలిసిమెలసి అన్ని తెలుగు సంఘాలతో ఇలాకార్యక్రమాలు జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందని వివరించారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక గెస్ట్ గా ఆహ్వానించిన మిచ్చెల్ జెఫ్మన్ స్వాతంత్య్ర దినోత్త్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సంతోషం వెలిబుచ్చారు.  అలానే ఈ కార్యక్రమానికి దాత అయిన డా. అంకినీడు ప్రసాద్ నన్నపనేని,స్వాతంత్య్ర దినోత్త్సవ శుభాకాంక్షలు తెలియజేసి, భారతదేశం భిన్నత్వం లో ఏకత్వం అని తెలియజేసారు.

అలాగే తెలుగు జాతీయ సంఘాల నాయకులైన TANA ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జయ్ తాళ్లూరి, రిప్రెసెంటేటివ్ సుమంత్ రామిశెట్టి  NATA రీజినల్ వైస్ ప్రెసిడెంట్లు, ఉదయ్ దొమ్మరాజు, అశోక్ అట్టాడ, బోర్డు అఫ్ డైరెక్టర్ చిన్నబాబు రెడ్డి, సభ్యులు మురళి మెట్టల, T.A.T.A.  న్యూ యార్కు రీజినల్ vice ప్రెసిడెంట్ సహోదర పెద్దిరెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ పవన్  రవ్వ స్వాతంత్య్ర దినోత్త్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.

TLCA ధర్మకర్తల మండలి  Treasurer కృష్ణ మద్దిపట్ల, శాశ్వత సభ్యులు డా. మోహన్ భాదె, నెహ్రు చెరుకుపల్లి మరియు సభ్యులు రావు వోలేటి గార్లు పాల్గొన్నారు. కోశాధికారి బాబు కుదరవల్లి,vice సెక్రటరీ జయ్ప్రకాష్ ఎంజపురి, EC సభ్యులు ప్రసాద్ కోయి, రమా వనమా, శిరీష తూనుగుంట్ల, ఉమా రెడ్డి, నెహ్రు కటారు మరియు సురేష్ తమ్మినేని సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కార్యవర్గ సభ్యులకు మరియు తోడ్పాటు అందించిన వలంటీర్లకు అధ్యక్షులు శ్రీనివాస్ గూడూరు ధన్యవాదాలు అందజేశారు.  

అంతేకాకుండా 2017 క్రీడోత్సవాలలో భాగమైన టెన్నిస్ ని దిగ్విజయంగా ప్రారంభించారు.  దాదాపు 80 మందికి పైగా క్రీడాకారులు వివిధ రంగాలలో పోటీ పడ్డారు. జూనియర్స్, సీనియర్స్ విభాగాలలో నిర్వహించిన ఈ క్రీడలలో పాల్గొన్న ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేశారు.

ఆగష్టు 19 న క్రికెట్ ఆటల పోటీలు నిర్వహిస్తామని  TLCA క్రీడల ముఖ్య నిర్వాహకులు సురేష్ బాబు తమ్మినేని మరియు సలహాదారులు జయప్రకాశ్ ఎంజపురి మరియు అశోక్ చింతకుంట  తెలియజేశారు.  ఈ క్రీడలకు పెద్ద సంఖ్యలో హాజరై క్రీడాకరులని ఉత్తేజపరచాలని కోరారు.

 

Click here for Event Gallery

Tags :