ASBL NSL Infratech

ప్రపంచ తెలుగు మహా సభలకు ఎన్నారై కో-ఆర్డినేటర్ గా మహేష్ బిగాలను నియమిస్తూ జీవో విడుదల

ప్రపంచ తెలుగు మహా సభలకు ఎన్నారై కో-ఆర్డినేటర్ గా మహేష్ బిగాలను నియమిస్తూ జీవో విడుదల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్తంగా డిసెంబర్ 15 నుండి 19 వరకు చేపట్టబోతున్న ప్రపంచ తెలుగు మహా సభలకు ఎన్నారై కో-ఆర్డినేటర్ గా శ్రీ మహేష్ బిగాల గారిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం GO విడుదల చేసింది. ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి సూచన మేరకు ప్రపంచం నలుమూలల నుండి భాష ప్రియులను ఆహ్వానించుటకై  ప్రపంచ తెలుగు మహాసభల కోర్ కమిటీ తీర్మానం తేదీ - 07-11-2017 మేరకు శ్రీ మహేష్ బిగాల గారిని ప్రపంచ తెలుగు మహాసభల ఎన్నారై కో-ఆర్డినేటర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించారు. 

ప్రస్తుతం అమెరికా లో ప్రపంచ తెలుగు మహా సభల సన్నాహక సభలు నిర్వహిస్తున్న శ్రీ మహేష్ బిగాల గారు ముఖ్య మంత్రి శ్రీ కెసిఆర్ గారికి, ప్రపంచ తెలుగు మహాసభల కోర్ కమిటీకి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు శ్రీ నందిని సిద్ద రెడ్డి గారికి, నిజామాబాద్ ఎంపీ శ్రీ కల్వకుంట్ల కవిత గారికి, నిజామాబాద్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారికి తనమీద నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినందుకు ధన్యవాదాలు తెలియచేసినారు. 

శ్రీ మహేష్ బిగాల గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు తెలపెట్టిన తెలుగు మహాసభలను విజవంతం చేయడానికి మడమ తిప్పకుండా తనవంతు కృషి చేస్తాను అని అన్నారు. తెలుగు భాష పండుగలో పాలుపంచుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సభలు ఇప్పటికే లండన్  (యూకే), అట్లాంటా(అమెరికా), టొరంటో (అమెరికా), శాన్ఫ్రాన్సిస్కో (అమెరికా), ఆక్లాండ్ (అమెరికా), న్యూజెర్సీ  (అమెరికా), డల్లాస్  (అమెరికా), వియన్నా (ఆస్ట్రియా), కోపెన్హాగన్ (డెన్మార్క్)లలో నిర్వహించారు. 

సన్నాహక సభలను నిర్వహించిన అన్ని ప్రదేశాలలో కూడా ఎన్నారైలు పెద్ద సంఖ్యాలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష పట్ల చూపుతున్న గౌరవాన్ని  పొగుడుతూ ఈ ప్రపంచ మహాసభలు తెలుగు యుక్కా గొప్ప తనాన్ని పప్రపంచానికి చాటుతాయని ఆశాభావం వ్యక్తం చేసారు.  తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్తంగా డిసెంబర్ 15  నుండి 19 వరకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మహేష్ గారు ఎన్నారైలను కోరారు.

 

Tags :