ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

చూడముచ్చటగా టాంటెక్స్‌ సంక్రాంతి వేడుకలు

చూడముచ్చటగా టాంటెక్స్‌ సంక్రాంతి వేడుకలు

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను ప్రజలు ఎంతో ఘనంగా జరుగుపుకుంటారు. అమెరికాలోని తెలుగువారి కోసం.. నార్త్‌ అమెరికాలోని తెలుగు సంఘాలలో ఒకటైన ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం (టాంటెక్స్‌) కూడా సంక్రాంతి సంబరాలను చూడముచ్చటగా ఘనంగా నిర్వహించింది. నిమిట్స్‌ హైస్కూల్‌లో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, చూడముచ్చటైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమంలో అచ్చమైన తెలుగు వాతావరణాన్ని ప్రతిబింబించేలా పాటలు, సంగీత, సాంస్కతిక, నృత్య కార్యక్రమాలు అందరిని అలరించాయి.

ఈ సంక్రాంతి సంబరాలను ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం(టాంటెక్స్‌) అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు ఆధ్వర్యంలో కార్యవర్గ, పాలకమండలితో పాటు సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రబంద్‌, జొన్నలగడ్డ శ్రీకాంత్‌, సాంస్కృతిక సమన్వయ కర్త స్రవంతి యర్రమనేని నిర్వహించారు. ఈ వేడుకలల్లో ముద్దుగారే యశోద, వందే మీనాక్షి, కష్ణాష్టకం, మాస్‌ ఈజ్‌ గ్రేట్‌, చరణములే నమ్మితి అనే స్థానిక కళాకారుల నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఈ కార్యక్రమనికి ప్రధాన వ్యాఖ్యాతగా వ్యవహరించిన సమీర ఇల్లెందుల ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయించారు. టాంటెక్స్‌ తక్షణ పూర్వాధ్యక్షులు చినసత్యం వీర్నపు మాట్లాడుతూ.. గత ఏడాది నిర్వహించిన కార్యక్రమాల గురించి వివరించారు. 2020వ సంవత్సరానికి టాంటెక్స్‌ అధ్యక్షులుగా ఉన్న కష్ణారెడ్డి కోడూరు మాట్లాడుతూ.. ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం(టాంటెక్స్‌) సంస్థని సాంస్కతిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండా సేవారంగంలో కూడా ముందుంచి ఘన చరిత్రని కాపాడడానికి నిరంతరం శ్రామికుడిగా కష్టపడతానని తెలిపారు. 2020 కార్యవర్గం, పాలక మండలి బందాన్ని ఆయన సభకు పరిచయం చేశారు. సంక్రాంతి సంబరాలకి పసందైన పండుగ భోజనాన్ని వడ్డించిన బావార్చి అర్వింగ్‌ వారికి ఉత్తర టెక్సాస్‌ కార్యవర్గం, పాలక మండలి తరుఫున ఆయన కత్ఞతలు తెలిపారు. టాంటెక్స్‌ వారి సంక్రాంతి సంబరాలకి విచ్చేసి ఎంతో ఓపికగా నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకి, అతిధులకి, పోషకదాతలకి అధ్యక్షుడు కష్ణారెడ్డి కోడూరు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమ నిర్వహణకు స్పాన్సర్లుగా వ్యవహరించిన నిజెల్‌ భవన నిర్మాణ సంస్థ, శరత్‌ యర్రం, రాం మజ్జి, టాంటెక్స్‌ సంస్థ డైమండ్‌ పోషకదాతలైన తిరుమల్‌ రెడ్డి కుంభం, ప్లాటినం పోషక దాతలైన బావార్చి అర్వింగ్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌, క్వాంట్‌ సిస్టమ్స్‌, ప్రతాప్‌ భీమి రెడ్డి, విక్రం జంగం, డా. పవన్‌ పామదుర్తి, శ్రీకాంత్‌ పోలవరపు, అనిల్‌ యర్రం, ఆనంద్‌ దాసరి, డీఎంఆర్‌ డెవలపర్స్‌, గోల్డ్‌ పోషకదాతలైన పసంద్‌ విందు, మై ట్యాక్స్‌ ఫైలర్‌, రాం కొనారా, స్వదేశి రమేష్‌ రెడ్డి , బసేరా హరి, కిషోర్‌ చుక్కాల, టెక్‌ లీడర్స్‌ దేవేంద్ర రెడ్డి, సిల్వర్‌ పోషకదాతలైన మురళి వెన్నం, డా.భాస్కర్‌ రెడ్డి సానికొమ్ము, పెంటా బిల్డర్స్‌, ఒమేగా ట్రావెలర్స్‌, అవాంట్‌ టాక్స్‌, విశ్వభారత్‌ రెడ్డి కంది, శ్రీకాంత్‌ గాలికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Click here for Event Gallery

 

Tags :