ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సేవా కార్యక్రమాల్లో ‘తానా’ ఎల్లప్పుడూ ముందుంటుంది - మోహన్‌ నన్నపనేని

సేవా కార్యక్రమాల్లో ‘తానా’ ఎల్లప్పుడూ ముందుంటుంది - మోహన్‌ నన్నపనేని

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఏర్పడిన తొలినాళ్ళలో భాషా, సాంస్కృతిక పరిరక్షణే ముఖ్య లక్ష్యంగా ఉందింది. కాని ఈ లక్ష్యాలతోపాటు తెలుగువారి కష్ట సుఖాల్లో పాలుపంచుకోవడంతోపాటు వారి ప్రగతికి కావాల్సిన సహాయ సహకారాలను కూడా అందివ్వాలని తానా లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోంది. ఆ దిశగానే తానా ఫౌండేషన్‌ ద్వారా వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము. మాకు విద్య నేర్పించి మమ్మల్ని ఇంతటివాళ్ళుగా తీర్చిదిద్దిన జన్మభూమి రుణాన్ని తీర్చుకోవాలన్న ఆశయంతో మేము ఎన్నో కార్యక్రమాలను మాతృరాష్ట్రాలలో చేపట్టాము.

అందులో భాగంగా విద్యాలయాలు, దేవాలయాల అభివృద్ధి, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇలా ఎన్నో కార్యక్రమాలతోపాటు గ్రామాల్లో పారిశుద్ధంకోసం మరుగుదొడ్ల నిర్మాణాలను కూడా కొన్నేళ్ళ క్రితమే తానా చేపట్టిందని మోహన్‌ నన్నపనేని తెలియజేశారు. సంగీతాన్ని కమర్షియల్‌గా కూడా చూడకుండా నిస్వార్థంతో చిన్నారులకు ఉచితంగా సంగీతాన్ని నేర్పించి వారిని మంచి కళాకారులనుగా తీర్చిదిద్దుతున్న రామాచారిగారిని అభినందించడంతోపాటు సంగీత శిక్షణకోసం సొంత భవనాన్ని ఆయనకు నిర్మించి ఇవ్వాలని ‘తానా’ అనుకుంది. ఇందులో భాగంగానే రామాచారి  శిష్యులతో అమెరికాలో చేసిన కార్యక్రమాల్లో వచ్చిన విరాళాలను ఈ కార్యక్రమం ద్వారా వారికి అందజేస్తున్నామని మోహన్‌ నన్నపనేని తెలిపారు. దాదాపు 45 లక్షల రూపాయల చెక్కును ఆయనకు బహూకరిస్తున్నట్లు తెలిపారు.

 

 

 

Tags :