ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

పర్యాటక ప్రాంతంగా ‘రామానుజుల విగ్రహం’

పర్యాటక ప్రాంతంగా ‘రామానుజుల విగ్రహం’

వచ్చే నెలలో ముచ్చింతల్‌లోని త్రిదండి చిన్న జీయర్‌ స్వామి ట్రస్ట్‌ ప్రాంగణం లో ఆవిష్కరించనున్న రామానుజుల విగ్రహం రాబోయే రోజుల్లో ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మారుతుందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ట్రస్ట్‌ ప్రాంగణాన్ని సందర్శించిన మంత్రులు.. రామానుజుల విగ్రహావిష్కరణ కోసం ప్రత్యేకంగా వేస్తున్న రోడ్ల పనులను పరిశీలించారు. ప్రాంగణంలోని దేవాలయాన్ని, రామానుజుల భారీ విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక హబ్‌గా మారిన రాష్ట్రానికి రామానుజుల విగ్రహం మకుటాయమానం కానుందని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రులతో పాటు చినజీయర్‌ స్వామి, మై హోమ్స్‌ అధినేత రామేశ్వర్‌ రావు, ఏపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Tags :