ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

యూఎస్ హౌస్ కు ప్రమీల జయపాల్

యూఎస్ హౌస్ కు ప్రమీల జయపాల్

భారత సంతతికి చెందిన ప్రమీల జయపాల్‌ అమెరికా కాంగ్రెస్‌కు ఎంపికయ్యారు. వాషింగ్టన్‌ నుంచి అమె డెమోక్రటిక్‌ పార్టీ తరపున సెనేటర్‌గా గెలిచారు. యూఎస్‌ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నికైన జయపాల్‌ సభలో జిమ్‌ మెక్‌డెర్మాట్‌ స్థానంలో బాధ్యతలు తీసుకోనున్నారు. జిమ్‌ యూఎస్‌ హౌస్‌లో 37ఏళ్లు పనిచేసిన అనంతరం రిటైర్‌ అవుతుండడంతో ఇప్పుడు ఆ స్థానంలో జయపాల్‌ వెళ్తున్నారు. తమిళనాడులోని చెన్నైలో జన్మించిన జయపాల్‌ అయిదేళ్ల వయసులో ఇండోనేషియాకు తర్వాత సింగపూర్‌ ఆ తర్వాత అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తమ ప్రాంతంలో వలసదారుల కోసం చేసిన కృషికి గాను అమెరికా వైట్‌హౌస్‌ 2012లోనే ఛాంపియన్‌ ఆఫ్‌ ఛేంజ్‌ అవార్డు వచ్చింది. ఎన్నికల్లో గెలుపొంది యూఎస్‌ కాంగ్రెస్‌లోకి వెళ్తే తాను మొదటిగా ట్యూషన్‌ ఫీజు లేని కమ్యూనిటీ కాలేజీ, తుపాకుల హింస నుంచి రక్షణ, ప్రాథమిక విద్యకు నిధులు తదితర బిల్లులను ప్రవేశపెడతానని హామీ ఇచ్చారు.

 

Tags :