ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సిలికానాంధ్ర యూనివర్సిటీ వార్షికోత్సవంలో లోకేష్

సిలికానాంధ్ర యూనివర్సిటీ వార్షికోత్సవంలో లోకేష్

సిలికానాంధ్ర యూనివర్సిటీ ప్రధమ వార్సికోత్సవంలోను లోకేష్‌ పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు మర్చిపోతే గుర్తింపు, భవిష్యత్తు ఉండవన్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని మిల్పిటాస్‌ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోకేష్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికా వస్తే మన భాష, సంస్క తి, సంప్రదాయాలు మర్చిపోయారని అనుకున్నానని, కానీ ఇక్కడ అన్నీ గుర్తుపెట్టుకుంటున్నారని, భారత్‌లోనే మర్చిపోతున్నారని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

కూచిపూడి నృత్యాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్‌లో కూచిపూడి సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటుచేయాలనే ఆలోచన ఉందని, దీనికి సహకరించాలని లోకేశ్‌ కోరారు. నృత్యం-సంగీతం-నాట్యకళలపై డా.పప్పు వేణుగోపాలరావు రచించిన పరిశోధనా విధానాలను లోకేష్‌ ఆవిష్కరించారు. విశ్వవిద్యాలయ నూతన వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. గరిమెళ్ల అనిలకుమార్‌, అనురాధ శ్రీధర్‌ల సంగీత విభావరి అలరించింది. కార్యక్రమంలో ప్రముఖ ప్రవాసాంధ్రుడు డా.లకిరెడ్డి హనిమిరెడ్డి, విశ్వవిద్యాలయ ప్రతినిధులు ఆనంద్‌ కూచిభొట్ల, దీనబాబు కొండుభట్ల, దిలీప్‌ కొండిపర్తి, చామర్తి రాజు తదితరులు పాల్గొన్నారు.

Click here for Event Gallery

 

Tags :