ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఏపీలో ఏరోసిటీ!

ఏపీలో ఏరోసిటీ!

నవ్యాంధ్రలో ఏరోసిటీ ఏర్పాటు కానుంది. ఏరోసిటీ దశలవారీగా 5.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో యుఏఈలోని మహ్మద్‌ అబ్దుల్‌ రహమాదన్‌ మహ్మద్‌ అల్‌జురానీకి చెందిన ఏవియేషన్‌ సిటీ ఎల్‌.ఎల్‌.పీ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పక్షాన ఏపీ ఆర్థికాభివృద్ధి మండలికి, ఏవియేషన్‌ సిటీ ఎల్‌ఎల్‌పీ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అవగహన ఒప్పందం కుదిరింది. ఏరో సిటీ పూర్తయితే 15 వేల మందికి ప్రత్యక్షంగా, 5 వేల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏవియేషన్‌ సిటీ నిర్మించే ఏరోసిటీ నిర్మాణంలో అత్యంత అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. దేశ విదేశాల నుంచి విజ్ఞానాన్ని తీసుకురావడం తమ ప్రాధాన్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ అన్నారు. దీన్ని ఎక్కడ స్థాపించాలన్నది ఇంకా నిర్ణయించలేదని, ఏరోసిటీ నిర్మాణానికి 10 వేల ఎకరాలు అవసరం ఉంటుందన్నారు. ఈ సంస్థ బృందం నవంబరు మూడవ వారంలో అధ్యయనంకోసం మన రాష్ట్రానికి రానుందని, వచ్చే జనవరిలో దావోస్‌లో ప్రాథమిక నివేదిక అందజేస్తుందన్నారు.

 

Tags :