ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మంత్రి కేటీఆర్ యూకే పర్యటన.. పలు కంపెనీలతో భేటీ

మంత్రి కేటీఆర్ యూకే పర్యటన.. పలు కంపెనీలతో భేటీ

యూకే పర్యటనలో భాగంగా రెండో రోజు మంత్రి కే తారకరామారావు పలు కంపెనీ ప్రముఖులతో సమావేశమయ్యారు. థామస్‌ లాయిడ్‌ గ్రూప్‌ ఎండి నందిత సెహగల్‌ తుల్లీ మరియు సీనియర్‌ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ లో కొనసాగుతున్న తమ కంపెనీ కార్యకలాపాల విస్తరణ పై చర్చించారు. పియర్సన్‌ కంపెనీ సీనియర్‌ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి కేటీఆర్‌, తెలంగాణలో నైపుణ్య శిక్షణ అభివృద్ధికి సంబంధించి చేపట్టిన పలు కార్యక్రమాల పైన వివరాలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌- టాస్క్‌ తో పని చేసేందుకు రియల్‌ సంస్థ ముందుకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తో భాగస్వామ్యానికి ముందుకు వచ్చిన పియర్సన్‌ సంస్థకి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్‌ వారిని తెలంగాణకి ఆహ్వానించారు.

క్రాన్‌ ఫీల్డ్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్ హాల్ఫార్డ్‌, ప్రో వైస్‌ ఛాన్సలర్ పోల్లార్డ్‌ లు మంత్రి కేటీఆర్‌ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏరోనాటికల్‌ యూనివర్సిటీ ప్రయత్నాల పట్ల తాము ఆసక్తిగా ఉన్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రపంచ స్థాయి ఏరోనాటికల్‌ యూనివర్సిటీ తెలంగాణ కేంద్రంగా తీసుకువచ్చే తమ ప్రయత్నంలో కలిసి రావాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ క్రాన్‌ ఫీల్డ్‌ యూనివర్సిటీ బృందానికి విజ్ఞప్తి చేశారు. హెచ్‌ఎస్బిసికి చెందిన పాల్‌ మెక్‌ పియార్సన్‌, బ్రాడ్‌ హిల్‌ బర్న్‌ లు మంత్రి కే తారకరామారావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో తమ కంపెనీ కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయని, ఇప్పటికే తమకు బలమైన ప్రెజెన్స్‌ ఉన్నదని తెలిపారు. తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ఇందుకు సంబంధించి త్వరలోనే స్పష్టమైన కార్యాచరణతో మరోసారి సమావేశం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

 

Click here for Photogallery

 

 

Tags :