ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్ సదస్సులో కోడెల

నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్ సదస్సులో కోడెల

చట్ట సభలు ప్రజాభీష్టాన్ని ప్రతిఫలించాలని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌  అభిలషించారు. అమెరికాలో పర్యటిస్తున్న స్పీకర్‌ కోడెల షికాగాలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ స్టేట్‌ లెజిస్లేచర్స్‌ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ శాసనసభ్యుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యులు ఆయా దేశాల రాజ్యాంగ పరిధిలును గుర్తెరిగి వ్యవహరించాలన్నారు. దీన జనులకు అవసరమైన సంక్షేమం మొదలు, అభివృద్ధి వరకు శాసనసభ్యులు చేసే చట్టాలు కీలకమన్నారు. చట్టాలు చేయటలో సభ్యులదే కీలక పాత్ర అని అన్నారు. ప్రజాస్వామ్య చరిత్రలో పార్లమెంటరీ వ్యవస్థ అత్యంత జావాబుదారీతనంతో కూడుకున్నట్లు వెల్లడించారు. సభ్యులు క్రమశిక్షణతో వ్యవహరించినపుడే, అది సాధ్యమవుతుందన్నారు. నియోజకవర్గాల ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా సభ్యులు చర్చల్లో పాల్గొని పాలక పక్షాల నుండి తగిన సమాధానం రాబట్టటంలో సఫలీకృతమవ్వాలన్నారు. నియమావళిలో స్వల్పమార్పులున్నప్పటికీ ప్రపంచంలోని అన్నీ పార్లమెంటుల పనితీరు ప్రజా సమస్యలు తీర్చటానికేన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు.

 

Tags :