ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణస్వీకారం

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్‌ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. మధ్యాహ్నం సరిగ్గా 1:25 గంటలకు కేసీఆర్‌ ప్రమాణస్వీకారం చేశారు. కేసీఆర్‌ అనే నేను అంటూ తెలుగులో ప్రమాణం చేశారు. ఆయనతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మహమూద్‌ అలీ ఉర్దూలో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేటీఆర్‌, హరీశ్‌రావుతో పాటు కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, మహమూద్‌ అలీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నూతన ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

 

Tags :