ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

చంద్రబాబుకి కేసి చేకూరి చిరు అభ్యర్థన

చంద్రబాబుకి కేసి చేకూరి చిరు అభ్యర్థన

ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనలో ఎన్నారై తెలుగుదేశం పార్టీ నాయకుడు కేసి చేకూరి ముఖ్యమంత్రికి చిన్న విన్నపాన్ని అందజేశారు. కృష్ణా డెల్టాని స్టెబిలైజ్‌ చేసి సీమకు నీళ్ళిచ్చినట్లుగానే బొల్లాపల్లి పల్నాడు సాగర్‌ రిజర్వాయర్‌ నిర్మించే లోపల పరికపూడిశెల ఎత్తిపోతలను వెల్దుర్తితో ఆపేయకుండా వినుకొండదాకా పొడిగించి నీళ్ళివ్వాలని కోరారు. అప్పుడు మా నియోజకవర్గం ఆయకట్టు స్టెబిలైజ్‌ అవుతుందని విన్నవించారు. ఈ విషయంలో తనకు మార్గదర్శనం చేసిన నరేంద్రకుమార్‌ థూళిపాళ్ళ, కేశవ్‌ పయ్యావులకు, నియోజకవర్గం ఎమ్మెల్యే జీవి అంజనేయులకు కేసీ చేకూరి ధన్యవాదాలు తెలిపారు.

 

Tags :