ASBL NSL Infratech

సమ్మిట్‌కు ప్రత్యేక ఆకర్షణగా జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు

సమ్మిట్‌కు ప్రత్యేక ఆకర్షణగా జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు

జీఈఎస్ సమ్మిట్ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన పలు ఏర్పాట్లు సమ్మిట్‌కు వచ్చిన ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రధానంగా రంగు రంగుల పెయింటింగులు, వివిధ జంతువుల ఆకృతితో పెట్టిన పూల కుండీలు, జాలు వారినట్టు ఉన్న హ్యాంగింగ్ గార్డెన్లు, ప్రధాని మోదీకి పెట్టిన స్వాగత తోరనాలు సమ్మిట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హెచ్‌ఐసీసీలోని సదస్సుకు హాజరైన పలువురు వీటివద్ద సెల్ఫీలు కూడా ప్రత్యేకంగా తీసుకున్నారు. రూ.45 కోట్ల వ్యయంతో నగరంలో చేపట్టిన రోడ్డు నిర్మాణం, లైవ్ మార్కింగులు, జంక్షన్‌ల అభివృద్ది, పుట్‌పాత్‌ల నిర్మాణం, సుందరీకరణ, లైటింగ్‌లతో నగరం మొత్తం ప్రత్యేక అందాలను సంతరించుకుంది. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులతో హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ నగర హంగులు ఏర్పాడ్డాయని సమ్మిట్‌కు హాజరైన పలువురు ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. పలక్‌నామా ప్యాలెస్ మార్గంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక లైటింగ్ ప్యాలెస్‌కు సరికొత్త సోగసులు అద్దాయి. మొత్తానికి గ్లోబల్ సమ్మిట్‌కు జీహెచ్‌ఎంసీ చేసిన ఏర్పాట్లు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.

 

Tags :