ASBL NSL Infratech

ఆటా తెలంగాణ కన్వెన్షన్ లో పలు కార్యక్రమాలు

ఆటా తెలంగాణ కన్వెన్షన్ లో పలు కార్యక్రమాలు

అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలోజూన్‌ 29 నుంచి జూలై 1 వరకు హ్యూస్టన్‌లోని జార్డ్‌ ఆర్‌ బ్రౌన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే కన్వెన్షన్‌కోసం పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడురోజులపాటు జరిగే ఈ వేడుకలను ప్రముఖ కవి స్వర్గీయ సి.నారాయణ రెడ్డికి అంకితమిచ్చారు. వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు, ప్రముఖుల ఉపన్యాసాలు, అష్టావధానం, సాహితీ సదస్సులు, హాస్యనాటికలు, పల్లెపాట-ఆటా నోట ఫైనల్స్‌, జానపద కార్యక్రమాలు, బతుకమ్మ, బోనాలు, కోలాటం వంటి ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు రైతులకోసం రచ్చబండ వంటి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బిజినెస్‌, రాజకీయ నాయకులతో చర్చలు, ప్రసంగాలతోపాటు, ఇమ్మిగ్రేషన్‌ వంటి విషయాలలో సూచనలు సలహాలను నిష్ణాతులతో ఇప్పిస్తున్నారు. మహిళలకోసం ప్రత్యేక కార్యక్రమాలను, సిఎంఇ, అలూమ్ని, యూత్‌ కార్యక్రమాలు, ప్రముఖులకు అవార్డులు, యూత్‌ డిన్నర్‌, క్రూయిజ్‌, చిన్నారులకోసం గేమ్స్‌ షో, ఆటలు, పాటలు వంటి కార్యక్రమాలను ఈ మహాసభల్లో ఏర్పాటు చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

 

Tags :