ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

చంద్రబాబుకు 2 కోట్ల రూపాయల చెక్కును అందజేసిన ‘తానా’

చంద్రబాబుకు 2 కోట్ల రూపాయల చెక్కును అందజేసిన ‘తానా’

హుదూద్‌ తుపాన్‌ బాధితుల సహాయార్థం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సేకరించిన 2 కోట్ల రూపాయల నిధులను తానా అధ్యక్షుడు మోహన్‌ నన్నపనేని ఆధ్వర్యంలో తానా ప్రతినిధులు గురువారంనాడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కలిసి అందజేశారు. ఉత్తరాంధ్రలో ఇటీవల సంభవించిన హుదూద్‌ తుపాన్‌ వల్ల తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు అమెరికాలోని తెలుగువాళ్ళంతా ఉదారంగా  ముందుకు వచ్చి విరాళాలను అందజేశారని తానా అధ్యక్షుడు మోహన్‌ నన్నపనేని తెలిపారు. సిద్ధార్థ మెడికల్‌ కళాశాల అల్యూమ్ని తరపున 50 వేల డాలర్లు, గ్రేటర్‌ బోస్టన్‌ తెలుగు సంఘం నుంచి 10వేల డాలర్లు, నెబ్రాస్కా తెలుగు సమితి నుంచి 10వేల డాలర్లు, రోచెస్టర్‌ ఇండియన్‌ కమ్యూనిటీ తరపున 9 వేల డాలర్లు, జాక్సన్‌ విల్లే తెలుగు సంఘం నుంచి, టక్సాన్‌ తెలుగు సంఘం (అరిజోనా), కనెక్టికట్‌ తెలుగు సంఘం, న్యూయార్క్‌ తెలుగు లిటరరీ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌, సిన్సినాటి తెలుగు ఫౌండేషన్‌ తరుపన వచ్చిన విరాళాలన్నింటిని చేర్చి ముఖ్యమంత్రి సహాయనిధికి తానా 2 కోట్లరూపాయల నిధులను అందజేసినట్లు మోహన్‌ వివరించారు. గత రెండువారాలుగా తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్యస్రవంతి కార్యక్రమాలు ముఖ్యమంత్రికి చెక్కు అందజేయడంతో ముగిశాయి. 

తానా అధ్యక్షుడు మోహన్‌ నన్నపనేని, తానా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ చౌదరి జంపాల, తానా బోర్డ్‌ డైరెక్టర్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ నరేన్‌ కొడాలి, తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ జయశేఖర్‌ తాళ్ళూరి, తానా కార్యదర్శి సతీష్‌ వేమన, కోశాధికారి మధు టాటా, డైరెక్టర్‌, మాజీ అధ్యక్షుడు జయరామ్‌ కోమటి, 20వ తానా కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ గంగాధర్‌ నాదెళ్ల, సంయుక్త కోశాధికారి అంజయ్య చౌదరి, ప్రాంతీయ ప్రతినిధులు రజని ఆకురాతి, రావు యలమంచిలి, అనిల్‌ లింగమనేని, గౌతమ్‌ గుర్రం, తానా ఫౌండేషన్‌ ట్రస్టీలు శ్రీనివాస్‌ గోగినేని, వాసుదేవరెడ్డి చిన్నా, హేమ కానూరు, ఆరోగ్య శిబిరాల కో ఆర్డినేటర్‌ అశోక్‌ బాబు కొల్లా తదితరులు చంద్రబాబును కలిసినవారిలో ఉన్నారు. 


View Photogallery

 

Tags :